

తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు తొలి అడుగు ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే
బిజెపి జిల్లా అధ్యక్షులు రితేష్ రాథోడ్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 06 :- తెలంగాణలో రేపటి భవిష్యత్తుకు, అదేవిధంగా బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా మొన్న జరిగిన పట్టభద్రులు,ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలే నిదర్శనమని నిర్మల్ జిల్లా బిజెపి అధ్యక్షులు రితేష్ రాథోడ్ తెలిపారు.పట్టభద్రులు,ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధించడంతో గురువారం ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి నివాసంలోఆయన మాట్లాడారు.బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి,కేంద్ర మంత్రి బండి సంజయ్ పోరాట ప్రతిమతో తెలంగాణలో ముందుకు వెళ్తున్నామని ఆయన తెలిపారు.రాబోయే కాలంలో తెలంగాణను కాపాడాలంటే బిజెపి ప్రభుత్వం రావాలని అందరూ కోరుకుంటున్నారని ఆయన తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలలో బిజెపి పార్టీ అభ్యర్థులను గెలిపించిన ఉపాధ్యాయ, పట్టభద్రుల సోదరులందరికీ పాదాభివందనం చేస్తున్నామని ఆయన తెలిపారు.ఏ విశ్వాసంతో మీరందరూ బిజెపి పార్టీకి పట్టం కట్టారో అదేవిధంగా మీ నమ్మకాన్ని నిలబెట్టేందుకు ప్రతి కాషాయ కార్యకర్త కృషి చేస్తారని ఆయన తెలిపారు.తెలంగాణలో బిజెపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి మనమందరం ఇప్పటినుండే కృషి చేద్దామని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు తక్కల రమణారెడ్డి,అదుముల్ల పద్మాకర్,శంకర్ పతి,నరేంద్ర చారి, సుంకరి సాయి తదితరులు పాల్గొన్నారు