తెలంగాణలో రేపటి నుండి భానుడి భగభగలు!
తెలంగాణలో ఈ సంవత్సరం మార్చి నెల మొదటి వారంలోనే ఎండలు మండుతున్నాయి. ఇప్పటికే అత్యధికంగా 39.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. మార్చి 12 నుండి 19 వరకు తెలంగాణ అంతటా బలమైన వేడిగాలులు వీస్తాయని వాతావరణ శాఖ మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఇక మార్చి 13 నుండి 18 మధ్య వేడి గాలులు గరిష్ట స్థాయికి చేరే అవకాశం ఉందని తెలిపింది. తగు జాగ్రత్తలు తీసుకోకుంటే ముప్పే అని హెచ్చరించింది