తెలంగాణలో కొత్త డిస్పెన్సరీల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్?
మనోరంజని ప్రతినిధి
హైదరాబాద్:మార్చి 08
రెండు దశాబ్ధాలుగా తెలంగాణ జిల్లాల కార్మి కులు ఎదురు చూస్తున్న ఈఎస్ఐసీ సేవలు త్వరలో అందుబాటులోకి రానున్నాయి.
ESIC డిస్పెన్సరీ ఏర్పాటుకు అడుగులు పడ్డాయి. హనుమకొండ, మెదక్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, సూర్యపేట, జిల్లాలో వీటిని ఏర్పాటు చేసేందుకు అనుమతించింది..
రాష్ట్రంలో కొత్తగా 20 డిస్పెన్సరీలు అవసరమని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించాక ఆర్థిక శాఖ అనుమతితో త్వరలోజీవో జారీ కానుంది.