తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం

తుపాకుల కాల్పులతో మరోసారి దద్దరిల్లిన దండకారణ్యం

మనోరంజని ప్రతినిధి చత్తీస్ ఘడ్:మార్చి 20 – దండకారణ్యంలో మరో సారి తుపాకి కాల్పులతో దద్దరిల్లింది, ఒకే రోజు బీజాపూర్ జిల్లా కాంకేర్ జిల్లాలో వేరు వేరు జరిగిన ఎన్కౌంటర్ లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. అయితే ఈ ఎదురు కాల్పుల్లో ఓ జవాన్ కూడా మృతి చెందినట్లు అధికారులు తొలగించారు. సంఘటన స్థలంలో భారీగా పేలుడు పదార్థాలు, ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా రిజర్వ్ గార్డ్​కు చెందిన ఒక జవాను మృతి చెందినట్లు అధికారు లు తెలిపారు. బీజాపూర్ జిల్లా గంగలూరు ప్రాంతంలో పెద్దఎత్తున మావోయిస్టులు ఉన్నారనే సమాచారంతో గురువారం ఉదయం నుండి భద్రతా బలగాలు అడవుల్లో కూంబింగ్ నిర్వహించాయి. ఈ క్రమంలో భద్రతా దళాలకు ఎదురపడిన మావోయిస్టులు కాల్పులకు తెగబడగా వారిపై భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయని అధికారులు తెలిపారు. ఎన్ కౌంటర్ ఘటనా స్థలంలో 18 మంది నక్సల్స్ మృతదేహాలతో పాటు తుపాకులు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. ఎదురుకాల్పులు కొనసాగు తున్నాయని, భద్రతా సిబ్బంది తిరిగి వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. మావోయిస్టుల నిర్మూలన లక్ష్యంగా చత్తీస్ గఢ్ అడవుల్లో సాగుతున్న ఆపరేషన్ కగార్ తో పచ్చని గిరిజన పల్లెలు రక్తమోడు తున్నాయి

  • Related Posts

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి

    గుండె పోటుతో ఆర్ ఎంపీ వైద్యులు మృతి మనోరంజని ప్రతినిధి కుబీర్ : మార్చి 22 – నిర్మల్ జిల్లా కుబీర్ పార్డి (బి ) గ్రామానికి చెందిన ఆర్ ఎంపీ వైద్యులు పోతన్న శనివారం ఉదయం గుండె పోటుతో మృతి…

    భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త

    : భార్య చెవి కోసి కమ్మలు తీసుకెళ్లిన భర్త మద్యానికి కట్టుకున్న తీసుకెళ్లిన మద్యానికి బానిసైన ఓ వ్యక్తి దారుణానికి బరితెగించారు. కట్టుకున్న భార్య చెవి కోసి అమ్మడానికి కమ్మలు తీసుకెళ్లిన ఘటన అనంతపురం జిల్లా. పెద్దపప్పూరు మండలం వరదాయపల్లి నికి…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

    మాజీ మంత్రి విడుదల రజని పై ఏసీబీ కేసు నమోదు?

    నేడు డబుల్ ధమాక

    నేడు డబుల్ ధమాక

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

    ఆర్టీసీ డిపోలకు మహిళ శక్తి బస్సులు

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!

    టెన్త్‌ విద్యార్ధుల అతి తెలివితేటలు.. కాపీ కొట్టేందుకు ఎంతకు తెగించారో తెలిస్తే షాక్‌!