

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి ౦2 తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేయడాన్ని బీసీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తెలంగాణ బీసీ హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా కన్వీనర్ సుంకేటపో శెట్టి మాట్లాడుతూ, “మల్లన్నను సస్పెండ్ చేయడం బీసీలందరికీ అవమానం” అని వ్యాఖ్యానించారు. బీసీల గొంతుకగా నిలిచిన చింత పండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకోవడం పూర్తిగా అన్యాయమని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కోమటిరెడ్డి బ్రదర్స్ వంటి అగ్రకుల నేతలు పార్టీ లోపల ఒకరిపై ఒకరు విమర్శించుకుంటూ ఉన్నా, వారికి మాత్రం ఎలాంటి చర్యలు తీసుకోలేదని, కానీ బీసీ నేత మల్లన్నను మాత్రం వెంటనే సస్పెండ్ చేయడం ఆపాదించదగిన చర్య అని ఆరోపించారు. “బీసీలు ప్రశ్నిస్తే సస్పెన్షన్, అగ్రకుల నేతలు విమర్శలు చేస్తే మాత్రం ప్రజాస్వామ్యం అంటారా?” అని కాంగ్రెస్ పార్టీని నిలదీశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ముందు సస్పెండ్ చేయకుండా, ఇప్పుడు ఈ చర్య తీసుకోవడం వెనుక బీసీలపై కాంగ్రెస్‌కు భయం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. మల్లన్నకు మద్దతుగా బీసీ సంఘాలు ఒక్కటిగా నిలబడాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్‌ను ఓడించి బీసీల శక్తిని చూపించాలని పిలుపునిచ్చారు.