మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 12 - నిర్మల్ జిల్లా తానూర్ మండల కేంద్రంలో ఉన్న నర్సరీలో దొంగతన ఘటన కలకలం రేపింది. చెట్లను రక్షించేందుకు ఏర్పాటు చేసిన గ్రీన్ మ్యాట్‌ను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించారని జాదవ్ జాలం సింగ్ బుధవారం వెల్లడించారు. దొంగతనం జరిగిన సమయంలో నర్సరీలో ఎవరు లేకపోవడంతో దొంగలు గ్రీన్ మ్యాట్‌ను తీసుకెళ్లారని అనుమానిస్తున్నారు. సుమారు రూ.5,000 విలువైన ఈ గ్రీన్ మ్యాట్ నర్సరీ నిర్వహణలో కీలకమైనదని ఆయన తెలిపారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసిన జాదవ్ జాలం సింగ్, వేగంగా దర్యాప్తు చేసి దొంగలను పట్టుకోవాలని కోరారు