తహసిల్ కార్యాలయ జూనియర్ అసిస్టెంట్ పై దాడి
ఆరుగురు పై కేసు నమోదు
భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్
మనోరంజని ప్రతినిధి తానుర్ మార్చి 17 :-
నిర్మల్ జిల్లా తానూర్ తహసిల్దార్ కార్యాలయంలో విధులో నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్ పై దాడికి పాల్పడిన వారి పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ తెలిపారు. ఏఎస్పీ తెలిపిన వివరాల తానూర్ తహశీల్దార్ కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగి సోమవారం భైంసా ఆర్డీవో కార్యాలయం నుంచి తానూర్ తహసిల్దార్ కార్యాలయానికి సంబంధించిన దస్తావేజులు తీసుకు వస్తుండగా మండలంలోని బొరిగాం గ్రామ సమీపంలో కొందరు యువకులు అతనిని అడ్డుకొన్ని దాడి చేసినట్లు ఏఎస్పి తెలిపారు. తానూర్ తహశీల్దార్ కార్యాలయానికి సంబంధించిన దస్తావేజుల ఎందుకు తీసుకొని వెళ్తున్నవని బూతులు తిట్టుతూ దాడి చేశారని ఏఎస్పీ వెల్లడించారు. ఇందులో అరుగురిపై కేసు నమోదు చేసి నలుగురికి అదుపుల్లో తీసుకున్నమని తెలిపారు. మరో కోందరు ఫరారిలో ఉన్నట్లు పేర్కొన్నారు.
ప్రజలు ఎవరు కూడా వదంతులు నమొద్ధని సూచించారు