తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

తమిళ సినిమా ఇండస్ట్రీ సంచలన నిర్ణయం

దేశవ్యాప్తంగా ఇప్పటికే డీలిమిటేషన్, హిందీ భాషపై వ్యతిరేకంగా తమిళనాడు చర్యలు తీసుకుంటున్న విషయం తెలిసిందే. జాతీయ విద్యావిధానంపై దుమ్మెత్తిపోసింది. దీంతో దేశవ్యాప్తంగా తమిళనాడు తీవ్ర చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ క్రమంలోనే తమిళ ఇండస్ట్రీ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఫిలిం యాక్టీవ్ నిర్మాతల కౌన్సిల్, FCFSI కీలక ఒప్పందం చేసుకున్నాయి. ఇకపై కోలివుడ్(తమిళ) సినిమా షూటింగ్ లకు FEFSI సభ్యులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు. మే 1 నుంచి ఈ విధానం అములు కానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంపై 2023లో కొంత చర్చ జరిగింది. ఫిల్మ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఆఫ్ సౌత్ ఇండియా (FEFSI).. ఇది తమిళ చిత్ర పరిశ్ర మలోని 23 యూనియన్ల నుండి టెక్నీషియన్లను కలిగి ఉన్న సంస్థ. ఈ నిర్ణయం వెనుక ప్రధాన కారణం.. ఇతర పరిశ్రమల నుండి నటులు, స్టార్లతో తమిళ సినిమాలు తీయడం వల్ల FEFSI సభ్యులకు ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయని వారు భావించారు. అలాగే.. తమిళ సినిమాలు విదేశీ లొకేషన్లలో షూట్ చేయడం కూడా స్థానిక టెక్నీషియన్లకు అవకాశాలను తగ్గిస్తోందని భావించారు. గతంలో దీనిపై చర్చ జరిగినప్పుడు.. తమిళ సినిమాల కోసం తమిళ ఆర్టిస్టులను మాత్రమే నియమించాలని, షూటింగ్ తమిళనాడులోనే జరగాలి, అత్యవసరం లేకపోతే రాష్ట్రం లేదా దేశం వెలుపల షూట్ చేయకూడదని నిర్ణయం తీసుకున్నారు. తాజాగా తమిళ సినిమా షూటింగ్‌లకు FEFSI సభ్యులకు మాత్రమే అవకాశాలు ఇవ్వాలని నిర్ణయించారు

  • Related Posts

    శివసేన రెడ్డి కుమారుని జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    శివసేన రెడ్డి కుమారుని జన్మదిన వేడుకలో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 28 : తెలంగాణ రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేన రెడ్డి కుమారుడు రుద్రసేనారెడ్డి మొదటి జన్మదిన వేడుకలకు షాద్ నగర్ ఎమ్మెల్యే,…

    పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు

    పెద్దల సమక్షంలో ఇద్దరమ్మాయిలను పెళ్లి చేసుకున్న యువకుడు నువ్వు తోపు భయ్యా మనోరంజని ప్రతినిధి కొమురం భీం జిల్లా మార్చి 28కొమరం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ గ్రామంలో జరి గిన పెళ్లి ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం