

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వయంగా పాల్గొన్నారు. తణుకు పట్టణంలోని ఎన్టీఆర్ పార్క్‌లో మున్సిపల్ కార్మికులతో కలిసి క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రజలు పరిశుభ్రతపై అవగాహన పెంచుకోవాలని, ప్రతి ఒక్కరూ తమ పరిసరాలను శుభ్రంగా ఉంచాలని సీఎం పిలుపునిచ్చారు. తణుకు చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రులు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమంలో పాల్గొన్న సీఎం స్వచ్ఛత గురించి ప్రజలతో మాట్లాడి, “పరిశుభ్రతతోనే ఆరోగ్యకరమైన సమాజం ఏర్పడుతుంది” అని పేర్కొన్నారు.
