

డ్రగ్స్ కేసుల్లో No.1గా మారిన ‘అక్షరాస్యుల కేరళ’
అత్యధిక అక్షరాస్యులున్న కేరళను డ్రగ్స్ భూతం వేధిస్తోంది. దాన్ని అంతం చేయడంలో GOVT విఫలమవుతోంది. తాజాగా పంజాబ్ను దాటేసి దేశంలోనే No.1 డ్రగ్స్ ప్రభావిత రాష్ట్రంగా మారింది. 2021లో 5,696గా ఉన్న NDPS కేసులు 2024లో 27,701కి చేరుకున్నాయి. పంజాబ్ (9,025)తో పోలిస్తే ఇవి 3 రెట్లు ఎక్కువ. 2021కి ముందు నాలుగేళ్లలో 37,228 కేసులు నమోదవ్వగా ఆ తర్వాతి నాలుగేళ్లలో ఇవి 87,101కు చేరాయి. ఏకంగా 130% పెరిగాయి..