

ప్రతిపాదిత డీలిమిటేషన్ మార్పుల వల్ల దక్షిణాది రాష్ట్రాలు ఎదుర్కొవాల్సిన సమస్యలపై చర్చించేందుకు తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ ఆధ్వర్యంలో చెన్నైలో దక్షిణాది రాష్ట్రాల జాయింట్ యాక్షన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్, టి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, యంపి మల్లు రవి హాజరయ్యారు. డీలిమిటేషన్ ద్వారా దక్షిణాది రాష్ట్రాలకు ప్రతినిధుల సంఖ్య తగ్గే అవకాశం ఉందని, దీనివల్ల రాజకీయ సమతుల్యత దెబ్బతింటుందని నేతలు అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడేందుకు ఒక సమిష్టి కార్యాచరణ రూపకల్పన చేయాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ హక్కులు, న్యాయబద్ధమైన ప్రాతినిధ్యం కోసం బలమైన పోరాటం కొనసాగుతుందని పేర్కొన్నారు.