

డివైడర్ ను ఢీకొని ఒకరి మృతి
మనోరంజని ప్రతినిధి బాసర మార్చి 24 :- డివైడర్ను ఢీకొని వ్యక్తి మృతి చెందిన ఘటన సోమవారం బాసరలో చోటుచేసుకుంది. ఎస్ఐ గణేశ్ తెలిపిన వివరాల ప్రకారం శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయం నుంచి రైల్వేస్టేషన్ వేళ్లే మార్గంలో ఓ వ్యక్తి బైక్ పై వేగంగా వచ్చి డివైడర్ను ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. కాగా మృతుడు బాసర సబ్ స్టేషన్లో అపరెటర్ గా పనిచేసే ప్రమోద్ గా గుర్తించినట్లు ఎస్ఐ వెల్లడించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బైంసా ఏరియా ఆసుపత్రికి తరలించారు