

డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం-2025 డైరీ ఆవిష్కరణ
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 04 :-నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకుల సంఘం -2025 డైరీను కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల బుచ్చయ్య ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘ అధ్యక్షులు డాక్టర్ భీమ్ రావ్ ఝాడే, కార్యదర్శి డాక్టర్ పవన్ కుమార్, డాక్టర్ పీజీ రెడ్డి మరియు కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ కర్రోల బుచ్చయ్య మాట్లాడుతూ అధ్యాపకుల సమగ్ర అభివృద్ధి కోసం ఈ డైరీ ఎంతగానో ఉపయోగపడుతుందని, విద్యా రంగంలో ఇంకా మెరుగైన సేవలను అందించడానికి ఇది దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. అధ్యాపకుల సంఘం నూతన డైరీ ద్వారా తమ కార్యాచరణను మరింత సమర్థవంతంగా నిర్వహించేందుకు సహకరించనుందని సంఘ అధ్యక్షులు డాక్టర్ భీమ్ రావ్ ఝాడే తెలిపారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించిన కళాశాల అధ్యాపక బృందానికి, సంఘ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు