

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 24 :- పేద ప్రజలకు ఆధునిక వైద్యాన్ని అతిచెరువుగా అందిస్తున్న ప్రముఖ ఆర్థోపెడిక్ వైద్యులు డాక్టర్ ప్రమోద్ చందర్ రెడ్డి సేవలు ప్రశంసనీయమని నిర్మల్ జిల్లా గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం కొనియాడింది, వారి సేవలను గాను డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డిని ఘనంగా సోమవారం సన్మానించిన సందర్భంగా జిల్లా నాయకులు వారి సేవలను కొనియాడారు, సొంత లాభం ఆశించకుండా పేద ప్రజలకు అతి తక్కువ ధరకే వైద్యాన్ని అందిస్తూ సామాజిక సేవలో సైతం పాల్గొంటున్న డాక్టర్ ప్రమోద్ చంద్ర రెడ్డి రాబోయే రోజుల్లో మరింత సేవలందించాలని ఈ సందర్భంగా తెలిపారు, ఈ కార్యక్రమంలో గ్రామీణ వైద్యుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు పోశెట్టి, భైంసా డివిజన్ అధ్యక్షులు మోహన్, జిల్లా కార్యదర్శి గంధం పోశెట్టి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రమేష్ యాదవ్, కుబీర్ మండల అధ్యక్షులు శంకర్, జిల్లా ముఖ్య సలహాదారులు మన్నె గంగాధర్, కుబీర్ మండల నాయకులు దత్తు సింగ్ తదితరులు పాల్గొన్నారు,