డాక్టరేట్ పొందిన గోవర్ధన్ కు ఘన సన్మానం
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 12 :- నిర్మల్ పట్టణానికి చెందిన రాజనీతి శాస్త్ర లెక్చరర్ గా ఇచ్చోడ, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న కొండా గోవర్ధన్ కు ఇటీవల హైదరాబాద్ లోని ఉస్మానియా విశ్వవిద్యాలయంలో డాక్టరేట్ పట్టా పొందారు.రాజనీతి శాస్త్రంలో పొలిటికల్ పార్టీ స్పెషల్ అండ్ పొలిటికల్ ఆవేర్నేస్ ఆఫ్ గ్రాస్ రూట్ లెవల్ లీడర్ షిప్ ఇన్ అదిలాబాద్ డిస్టిక్ అనే అంశంపై పరిశోధన చేసి ఉస్మానియా విశ్వవిద్యాలయం నుండి ప్రొఫెసర్ నాయుడు అశోక్ ఆధ్వర్యంలో పరిశోధన పూర్తి చేశారు. ఈసందర్భంగా బుధవారం ఆయన ను మిత్ర బృందం శాలువ పూలమాలలతో ఘనంగా సన్మానించి,అభినందించారు. ఈకార్యక్రమంలో మిత్రులు తాటికొండ స్వామి, సాగర్ రెడ్డి, మహేష్,గుమ్ముల ఆశోక్,సాయి కుమార్, ,తదితరులు పాల్గొన్నారు