డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్నిఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

డబ్ల్యూ జే ఐ ఉగాది పంచాంగాన్ని
ఆవిష్కరించిన రాష్ట్ర మంత్రులు

మనోరంజని ప్రతినిధి హైదరాబాద్ మార్చి 28 :- హైదరాబాద్: వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా ( డబ్ల్యూ జే ఐ ) రూపొందించిన శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది పంచాంగం/దైనందినిని రాష్ట్ర మంత్రులు శ్రీధర్ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్ లోని మినిస్టర్ క్వార్టర్స్ లో డబ్ల్యూ జే ఐ ప్రతినిధులు వారిని కలిసి జర్నలిస్టుల సంక్షేమానికి యూనియన్ చేపట్ఠిన, చేపట్టనున్న కార్యక్రమాలను వివరించారు. సమస్యల పరిష్కారానికి సహకరించాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా మంత్రులు పాత్రికేయులకు, ప్రజలకు తెలుగు వత్సర శుభాభినందనలు తెలిపారు. సమస్యలపై పోరాటంలో తాము జర్నలిస్టుల వెంట కలిసి నడుస్తామని వర్కింగ్ జర్నలిస్ట్స్ ఆఫ్ ఇండియా జాతీయ కార్య నిర్వాహక అధ్యక్షుడు సంజయ్ ఉపాధ్యాయ, ప్రధాన కార్యదర్శి నరేంద్ర భండారి, సీనియర్ ఉపాధ్యక్షుడు సంజయ్ సక్సేనాలు తమ సందేశాల్లో పేర్కొన్నారు. తెలుగు ప్రజలకు , పాత్రికేయులకు వారు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. పంచాంగం/దైనందిని ఆవిష్కరణ కార్యక్రమంలో డబ్ల్యూ జే ఐ రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు నందనం కృపాకర్, అధ్యక్షుడు రాణాప్రతాప్ రజ్జూభయ్యా , ప్రధాన కార్యదర్శి రావికంటి శ్రీనివాస్, కార్యదర్శి క్రాంతి ముదిరాజ్, నగర అధ్యక్షుడు బాలకృష్ణ పాల్గొన్నారు.

  • Related Posts

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 30 :- నిర్మల్ జిల్లా కుంటాల మండలంలో మున్నూరు కాపు సంఘం నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సంఘ సభ్యుల సమావేశంలో తోట రఘు…

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క,ట్రైకార్ చైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్‌కు కృతజ్ఞతలు ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం తెలంగాణ ప్రభుత్వం గోరు బోలి (లంబాడా) భాషను భారత రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో చేర్చేందుకు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    కుంటాల మండల మున్నూరు కాపు సంఘం కొత్త కార్యవర్గం ఎన్నిక

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    మయన్మార్‌లో మళ్లీ భూకంపం.. పరుగులు పెట్టిన జనం..

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి సంచలన వ్యాఖ్యలు

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

    ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ తల్లీ విగ్రహం వద్ద సీఎం చిత్రపటానికి పాలాభిషేకం