

ట్రాఫిక్ వల్ల మరియు డ్రంక్ అండ్ డ్రైవ్ వల్ల జరిగే రోడ్డు ప్రమాదాల కారణాలపై ప్రత్యేక దృష్టి :: డా.జి.జానకి షర్మిల ఐపిఎస్
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 27 :-ఇటీవల జిల్లా ఎస్పీ డా.జి.జానకి షర్మిల ఐపిఎస్ జిల్లాలో ట్రాఫిక్ నియంత్రణ పై మరియు రోడ్డు ప్రమాదాలపై మరియు రోడ్డు ప్రమాదాలు జరిగే కారణాలపై ప్రత్యేక దృష్టి సారించి పలుమార్లు జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించటం జరిగింది. ఇందులో భాగంగానే రెండు రోజుల క్రితం ట్రాఫిక్ నియత్రాణ సామాగ్రిని అన్ని పొలీస్ స్టేషన్లు కు సరఫరా చేయటం జరిగింది. రాత్రి వేళల్లో హోటళ్లలో , డాబాల్లో మద్యం సేవించి వాహనాలు నడపటం వాళ్ళ ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి అని గ్రహించి, ఇందులో భాగంగానే మంగళ వారం రోజు రాత్రి డాబా లాపై ఆకస్మిక తనిఖి నిర్వహించటం జరిగింది. అదేవిధంగా గురువారం రాజేష్ మీన ఐపిఎస్ నేతృత్వం లో నిర్మల్ రూరల్ మండల్ గ్రామం రాణాపూర్ లో రిలయన్స్ పెట్రోల్ బంకు దగ్గర మరియు గ్రామంలోని రోడ్డుపై గల హోటల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించినారు. అడే చందు వద్ద రూపాయలు 73187 విలువగల 104 లీటర్ల మందు బాటిళ్లు సీజ్ చేసి కేసు చేయటం జరిగింది