

ట్రాన్స్ జెండర్ దీపు హత్యకు నిరసనగా కొవ్వొత్తులతో నివాళి.
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా ప్రతినిధి.మార్చి 24 :- మంచిర్యాల జిల్లా, 100 ఫీట్ల రోడ్డు, చున్నం బట్టి వాడ శ్రీరామ్ నగర్ కాలనీలో గల మాతృ ఛాయా ఆఫీసు నందు ఈనెల 19వ తేదీన అనకాపల్లిలో దీపు అనే హిజ్రా హత్యకు నిరసన తెలుపుతూ కొవ్వొత్తులతో నివాళులర్పించడం జరిగినది.ఈ విషయమై మాతృ ఛాయ బోర్డు మెంబర్స్ అయిన అరుణ మరియు రాజు మాట్లాడుతూ అనకాపల్లిలో దీపు అనే హిజ్రాను దిలీప్ కుమార్ అలియాస్ బన్నీ అనే వ్యక్తి హత్య చేసి శరీరాన్ని ముక్కలుగా కోసి వివిధ ప్రాంతాలలో పడేయడం జరిగింది దీపును చంపిన హంతకుడికి కఠినమైన శిక్ష విధించాలని తమకు రక్షణ కల్పించాలని హంతకుడు అయినా దుర్గాప్రసాద్ ని కఠినంగా శిక్షించాలని విచారణ ఫాస్ట్ ట్రాక్ కోర్టు ప్రభుత్వం ఏర్పాటు చేయాలని మధ్యంతర బెయిలు మంజూరు కాకుండా చూడాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ట్రాంజెండర్లకు ఏదైనా ఘటన జరిగితే త్వరగా విచారణ జరిగేలా చర్యలు తీసుకోవాలని మాతృ ఛాయ ఫౌండేషన్ తరపున ప్రభుత్వాలను డిమాండ్ చేస్తూ వున్నాము అని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు.