

ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదరులకు ఇఫ్తార్ విందు
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 22 :- పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని ట్రస్మా నిర్మల్ శాఖ ఆధ్వర్యంలో ముస్లిం సోదర స్కూల్ కరెస్పాండెంట్లకు ప్రత్యేకంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షుడు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ సామాజిక ఐక్యతను ప్రోత్సహించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బాస్, నిర్మల్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ అయ్యనగారి శ్రీధర్, జిల్లా సెక్రటరీ శ్యామ్ ప్రకాష్, స్టేట్ ఈసి మెంబెర్ షబ్బీర్ పాల్గొని ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. సామాజిక సమగ్రతను పెంపొందించే లక్ష్యంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తామని నాయకులు తెలిపారు