ట్రస్టు సహకారాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 17 :- నిర్మల్ జిల్లా -సారంగాపూర్: కెఎన్ఆర్ ట్రస్టు సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎంఈఓ మధుసూధన్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొల్లోజి నర్సయ్య లు అన్నారు. మండలంలోని జామ్ గ్రామానికి చెందిన కోర్వ నవీన్ రెడ్డి న్యాయవాది నెలకొల్పిన కొర్వ నవీన్ రామ క్రిష్ణ రెడ్డి ట్రస్ట్ (కెఎన్ఆర్) జాం/ హైదరాబాద్ గార్ల ఆధ్వర్యంలో సోమవారం మండలంలోని చించోలి(బి),ధని,ఆలూరు గ్రామాల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్, పెన్నులు,ఇంగ్లీష్ డీ క్షణరీ లు పరీక్ష సామాగ్రి అందజేశారు.. ఈ సందర్బంగా వారు మాట్లాడారు..విద్యార్థులు చిన్నప్పటి నుండే సేవ భావం అలవచ్చుకోవాలని అన్నారు.కెఎన్ఆర్ ట్రస్టు అందించిన సహకారాన్ని అందిపుచ్చుకొని ఉపాధ్యాయులు బోధించిన పాఠ్యాంశాలను శ్రద్ధగా చదివి పది పరీక్షల్లో మంచి ఉత్తీర్ణత సాధించాలని సూచించారు.ఈసందర్బంగా పాఠశాల తరుపున కెఎన్ఆర్ ట్రస్టు సేవలను అభినందించారు. ఈ కార్యక్రమంలోప్రధానోపాధ్యాయులు రమేష్,కరుణా,వివేకానంద రెడ్డి,నాయకులు
ఒలత్రి నారాయణరెడ్డి,సాధప్రశాంత్,సురేందర్,షఫీ,లింగారెడ్డి,చిన్నయ్య,సాయన్న,రాజేందర్ పాల్గొన్నారు.