

టెన్త్ పరీక్షా కేంద్రాన్ని పరిశీలించిన ఏఎస్పి
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 29 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ఆశ్రమ పాఠశాల, ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పదవ తరగతి పరీక్ష కేంద్రాలను బైంసా ఏఎస్పి అవినాష్ కుమార్ పరిశీలించారు. పరీక్షా కేంద్రాలను పరిశీలించి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని సూచించారు. ఏఎస్పి వెంట ముధోల్ ఎస్సై సంజీవ్ కుమార్, తదితరులున్నారు