టీటీడీ శ్రీవారి ఆలయంలో పరకామణిలో లెక్కింపులో అవకతవకలు
తిరుమల :
శ్రీవారికి సమర్పించిన హుండీ కానుకల్లో చేతివాటం ప్రదర్శించిన టీటీడీ ఉద్యోగి కృష్ణ కుమార్
హుండీ లెక్కింపులో విదేశీ కరెన్సీని స్వాహా చేసిన సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్
గత సంవత్సరం ఒక నెలలో రూ. 6 లక్షల విదేశీ కరెన్సీ స్వాహా
హుండీలో వచ్చిన విదేశీ కరెన్సీని ప్రతి నెల 1వ తేది తిరుమల పరకామణిలో జమ చేయాలి
విదేశీ కరెన్సీ లెక్కింపులో తేడాలు జరిగినట్లు గుర్తించిన టీటీడీ విజిలెన్స్ వింగ్
సీనియర్ అసిస్టెంట్ కృష్ణ కుమార్ అవకతవకలకు పాల్పడినట్లు గుర్తించిన విజిలెన్స్ వింగ్
నివేదికను టీటీడీ ఈవో శ్యామలరావుకు సమర్పించిన విజిలెన్స్ వింగ్
నివేదిక ఆధారంగా కృష్ణ కుమార్ ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఈవో శ్యామలరావు