

టీటీడీ కీలక నిర్ణయం!
AP: తిరుమల తిరుపతి దేవస్థానంలో శ్రీవారి దర్శనాలు, సేవలు, వసతులు తదితర టికెట్ల బుకింగుల్లో దుర్వినియోగం, దళారుల ప్రమేయాన్ని నిరోధించేందుకు, పారదర్శకతను పెంచేందుకు కూటమి ప్రభుత్వం ఆధార్ ఆథెంటికేషన్, ఈకేవైసీలను అమలు చేయనుంది. గతేడాది ఆగస్టు 5న కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్ మంత్రిత్వశాఖ సమ్మతి తెలపింది. ఈచర్యతో ఒకరి పేరుతో మరొకరు రాకుండా నిరోధించేందుకు, సేవలు పొందేటప్పుడు తనిఖీ ప్రక్రియ క్రమబద్ధీకరణకు వీలవుతుంది