టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8మంది కార్మికుల మృతి?

టన్నెల్ సొరంగంలో చిక్కుకున్న 8మంది కార్మికుల మృతి?

మనోరంజని ప్రతినిధి

శ్రీశైలం ఎడమకాలువ సొరంగంలో వారం రోజుల క్రితం చిక్కుకుపోయిన 8 మంది కార్మికుల్ని తీసుకొచ్చేందుకు వివిధ వర్గాలు చేసిన ప్రయత్నాలు విఫలమైనట్లు తెలుస్తోంది. ఇవాళ టన్నెల్ లోపల 8 మంది కార్మికుల మృతదే హాల్ని గుర్తించినట్లు సమాచారం.

వాటిని బయటికి తీసుకొ చ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. వారం రోజులుగా ఎన్డీఆర్ఎఫ్ తో పాటు వివిధ టీమ్స్ చేసిన ప్రయత్నాలు విఫలమ య్యాని దీన్ని బట్టి అర్ధమ వుతోంది.ఇవాళ ఏడో రోజు రెస్క్యూ ఆపరేషన్ లో భాగంగా రైల్వే శాఖ కూడా రంగం లోకి దిగింది.

సొరంగం తవ్వేందుకు ఉపయో గించిన టీబీఎం మిషన్ అందులో చిక్కుకు పోవ డంతో దాన్ని రైల్వే నిపుణులు ప్లాస్మా గ్యాస్ కట్టర్ల సాయంతో కట్ చేశారు. అనంతరం సహాయక బృందాలు లోపలికి వెళ్లేందుకు అవకాశం లభించింది.

లోపలికి వెళ్లి చూడగా.. అందులో కార్మికుల మృతదేహాలు బురద, మట్టిలో కూరుకుపోయి కనిపించాయని తెలుస్తోం ది. దీంతో అక్కడ విషాద వాతావరణం నెలకొంది. వారం రోజులుగా సొరంగం లో ఉన్న కార్మికుల్ని అధికారులు, సహాయక సిబ్బంది చేయని ప్రయత్నం లేదు. తాజాగా అత్యాధు నిక గ్రౌండ్ పెనెట్రేంగ్ రాడార్ ను కూడా వాడారు.

దీని సాయంతో సొరంగంలో పైకప్పు కూలిన ప్రాంతంలో కింద ఏముందో తెలుసుకు నేందుకు ప్రయత్నించారు. దీంతో అక్కడ మృతదేహా ల్ని గుర్తించినట్లు తెలుస్తోం ది. వెంటనే దగ్గరకు వెళ్లి మట్టి, బురద తొలగిస్తే అందులో మృతదేహాలు కనిపించాయని సమా చారం.

ఈ నేపథ్యంలో అధికారులు సహాయక సిబ్బందిని అక్కడికి రప్పించి వాటిని బయటకు తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం ఇప్పటివరకూ దీనిపై అధికారికంగా ప్రకటన చేయలేదు. దీంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి

  • Related Posts

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు

    సినీ నటి జెత్వానీ కేసు… ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్ పొడిగింపు జెత్వానీని అరెస్ట్ చేసి ఇబ్బందులు పెట్టిన కేసు ఇప్పటికే సస్పెండ్ అయిన పీఎస్సార్ ఆంజనేయులు, కాంతిరాణా, విశాల్ గున్నీ సస్పెన్షన్ మరో ఆరు నెలలు పొడిగింపు మనరంజని రంగారెడ్డి…

    అక్రమంగా తరలిస్తున్న ఇసుక వాహనం పట్టివేత అక్రమంగా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పవు – తహసీల్దార్ లింగం మూర్తి మనోరంజని ప్రతినిధి తానూర్ మార్చి 13 – అక్రమంగా ఇసుక తరలిస్తే చర్యలు తప్పవని తహసీల్దార్ లింగం మూర్తి స్పష్టం చేశారు.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    ఈ నెలలో రెండు గ్రహణాలు

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    వందేభారత్ ప్రయాణికులకు గుడ్ న్యూస్

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    జ‌గ‌దీశ్ రెడ్డిపై స‌స్పెన్ష‌న్‌ వేటు అప్రజాస్వామికం

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .

    వివేకానంద పాఠశాలలో హోలీ సంబరాలు .