జూ. ఎన్టీఆర్కు నేనంటే చాలా ఇష్టం: పురందేశ్వరి
తెలుగు స్టార్ హీరో జూ. ఎన్టీఆర్పై ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమెను.. ఓ రిపోర్టర్ ఎన్టీఆర్తో మీ సంబంధం ఎలా ఉంటుంది అని ప్రశ్నించారు. దీనికి ఆమె స్పందిస్తూ.. 'ఓ అత్తలా నన్ను చాలా గౌరవిస్తాడు. నేను అంటే చాలా ఇష్టం. మా పిల్లలు, కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ పిల్లలు తరచూ వీడియో కాల్స్ మాట్లాడుకుంటారు. వారి సినిమాలు బాగుంటే ఫోన్ చేసి అభినందిస్తాను' అని అన్నారు.