

వేసవి కాలంలో విద్యార్థులకు తాగునీటి కష్టాలు లేకుండా చేయడానికి యూనిమోని ప్రైవేటు కంపెనీ నిర్మల్ పట్టణంలోని జూమెరత్ ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ఫిల్టర్ అందజేసింది. ఈ కార్యక్రమంలో యూనిమోని నిర్మల్ బ్రాంచ్ మేనేజర్ రవి కుమార్, యూనిమోని స్టాఫ్ అఖిలేష్, నర్సయ్య, చందు, సంతోష్, స్రవంతి, వాణి పాల్గొన్నారు. పాఠశాల ఉపాధ్యాయులు ఈ సహాయాన్ని అభినందించారు.
