

జామ్ గ్రామం గురుకుల పాఠశాలలో పర్యావరణ అవగాహన కార్యక్రమం
మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ ఏప్రిల్ 07 :- నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామంలో ఉన్న సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల వేదికగా “Expert Talk” పేరిట పర్యావరణ పరిరక్షణ, వన్యప్రాణుల సంరక్షణ, జీవవైవిద్యం వంటి అంశాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సారంగాపూర్ ఉప అటవీ క్షేత్రాధికారి మహమ్మద్ నజీర్ ఖాన్ ముఖ్య అతిథిగా హాజరై పర్యావరణ సంబంధ అంశాలపై వివరంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పర్యావరణాన్ని కాపాడటం మన బాధ్యత మాత్రమే కాకుండా, భవిష్యత్ తరాలకు మిగల్చే విలువైన ఆస్తి కూడా” అని వివరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్, పాఠశాల సిబ్బంది, అటవీ శాఖ అధికారులు భూమేష్, స్రవంతి, స్వప్న, వెన్నెల, సుజాతలతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమం విద్యార్థుల్లో పర్యావరణంపై చైతన్యం పెంపొందించింది