

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో సిపిఐ శాసనసభ పక్ష నేత కూనంనేని సాంబశివరావు జర్నలిస్టుల సంక్షేమానికి సంబంధించి వాయిదా తీర్మానం ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఉద్యోగ భద్రతను కల్పించడంతో పాటు, వారికి ఇళ్ల స్థలాలు, మెరుగైన వైద్య సదుపాయాలు అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. అలాగే, పింఛన్ పథకం అమలు చేయడం ద్వారా పత్రికా రంగంలో సేవలందిస్తున్న జర్నలిస్టులకు భవిష్యత్ భద్రత కల్పించాలన్నారు. మీడియా ప్రతినిధులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన అభిప్రాయపడ్డారు.