జయహో…..డ్రైవరన్నలు… జయహో…..!

జయహో…..డ్రైవరన్నలు… జయహో…..!

తిరిగిరాని ప్రయాణం కాదు…నీ ప్రయాణానికి తిరుగులేదు.

మనోరంజని ప్రతినిధి మార్చి 23 – మన దేశంలో ప్రజలకు మంచి సేవలు అందిస్తున్న రంగాలలో రవాణారంగం ఒకటి.ఈ రంగంలో పనిచేస్తున్న వ్యక్తులలో డ్రైవర్ అనే వ్యక్తి పాత్ర చాలా గుర్తించదగినది. ముఖ్యంగా డ్రైవర్ లేనిదే రవాణారంగం ముందుకు సాగదు.డ్రైవర్ తాను చేరుకోవాల్సిన మార్గంలో సాగిపోతూనే బ్రష్ చేయడం నుండి భోజనం చేయడం వరకు చాలా స్వల్ప సమయంలో అన్ని పనులు ముగించుకుని కాలచక్రాన్ని…వాహన చక్రంలో ఇముడ్చుకుని నిత్యం వాహనచక్రం కన్నా ముందుగా తన గమ్యానికి చేరుకుంటున్నాడు.ఈ రవాణారంగంలో మరి ముఖ్యంగా లారీ డ్రైవర్ల పరిస్థితి చాలా భయానకం గా ఉంటుంది.ఒక్కసారి క్లినర్ లేని లారీలో డ్రైవర్ ఒక్కడే వందల కిలోమీటర్లు ప్రయాణం చేసే సమయంలో అదే లారీలో మనం అతనితో ప్రయాణం చేస్తే…డ్రైవర్ జర్నీ ఎంత భయానకంగా ఉంటుందో మనకు ఈజీగా అర్థమవుతుంది.వందల కిలోమీటర్లు ప్రయాణం.అనుకున్న సమయానికి ఏ మాత్రం ఆలస్యం కాకుండా ముందుగానే సరుకు దించగలిగితే డ్రైవర్ చాలా గ్రేట్.సమయానికి 5 నిమిషాలు దిగుమతి ఆలస్యం అయితే డ్రైవర్ అనే వ్యక్తికి ఎంత ఓర్పుగా సరుకు తీసుకురాగలిగాడు అని ఆలోచించేవాడు ఒక్కడు కూడా ఉండడు. ఇకపోతే అదో….అర్ధరాత్రి వేళ ఆ సమయానికి కొంచెం ముందే ఆరోగ్యం సరిగాలేదు అందుకే చాలా కొద్దిగా ఆహారం తీసుకున్నాను.మరోప్రక్క సరుకు దిగుమతి చేయించుకోవాల్సిన పార్టీ బండి ఎన్ని గంటలకు వస్తుంది అని హుంకరింపు, అంతే క్షణం ఆలస్యం చేయకుండా ఒక్క ఉదుటనే మళ్ళీ లారీ క్యాబిన్లోకి….ప్రయాణం మళ్ళీ మొదలు.అర్థరాత్రి కదా….వేసవికాలం.లారీతో నా ప్రయాణం అదే రోడ్డుపై చల్లగాలికి సాఫీగా సాగిపోతుంది.ఆ రోడ్డుపై ప్రతీ నిమిషానికి, ఓ వాహనం తప్ప పెద్దగా ట్రాఫిక్ లేదు.లారీ లైట్ల వెలుతురులో నల్లగా కనిపిస్తున్న రోడ్డు,ఆ వెలుగు వరకు ఓ.కే,ఆ పైన కనిపించే రోడ్డు శూన్యంగా కనిపిస్తుంది.లారీ ముందు కు కదిలి వెళ్లేంత దూరం కనిపించే వెలుగుతోనే ప్రయాణం. కానీ… శూన్యంలా కనిపిస్తున్న రహదారి,సాఫీగా వెళుతున్న లారీ…నల్లని రోడ్డును తాకుతూ ముందుకు వెళుతున్న లారీ టైర్లు అదోరకమైన సౌండ్,ఇలాంటి నిశ్శబ్ద వాతావరణంలో ముందుకు వెళుతున్న ప్రతీ నిమిషం అత్యంత ఊహాజనిత భయం. మరోప్రక్క కంటికి కునుకురాని టెన్షన్.కానీ కొన్ని కిలోమీటర్ల వెళ్ళాక కళ్ళు మూతపడుతూ… నిద్రమత్తు వచ్చింది. అంతే,ఆ కొద్దిపాటి సమయంలో ఏమయ్యింది తెలియదు గర్రు….మంటూ ఓ పెద్ద సౌండ్.కళ్ళు తెరిచి చూస్తే ఎదుట ఏమీలేదు. ఏం…జరిగిందో తెలుసా…?నా ఎదురుగా వచ్చిన వాహనం ఆరంగుళం గ్యాప్ కూడా లేకుండా నా లారీని గర్రు…. మని రాసుకుంటూ వెళ్ళింది. గుడ్ లక్ సేఫ్ గా ఉన్నాను. అయినా సరే…ఆగని ప్రయాణం.ప్రయాణ గమ్యం మరింత దూరం. రోజులు-పూటగా మారితే, పూట కాస్తా…గంటల వ్యవధిగా మారింది. అప్పుడే తెల్లవారుజాము కానుందని మనసులో ఒకటే ఆందోళన.కారణం గమ్యానికి చేరాలి అంటే, వేగం ఇక తప్పదు.కొద్దీ దూరం వెళ్ళాక ఏదో పెద్ద ఆకారం ఒక్కసారిగా మీద పడినట్లు అనిపించింది. సమయం బావుంది.ఏం అయ్యిందో అనుకునేలోపు రెండు వాహనాల క్యాబిన్లు అంగుళం గ్యాప్ లో డీ కొనబోయాయి.స్టీరింగ్ ఎడమవైపుకు విసరడంతో పెద్ద ఓ ప్రమాదం తప్పింది.అంతే చావు నోట్లో నుండి బయటపడినట్లు నాకు నిద్రమత్తు వదిలింది. మరో విధానంలో చూస్తే కొండలు,గుట్టలు,లోయలు,లో లెవల్ చప్టాలు,ఘాట్ రోడ్లను,చిట్టడవులు,అరణ్యాలను మన డ్రైవర్లు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని చావు-బ్రతుకుల సమరంగా, ఈ సమాజా నికి అవసరం ఉన్న నిత్యావసర వస్తువుల నుండి ప్రతీ వస్తువును రవాణా చేస్తూ ఉన్నారు డ్రైవర్లు.వీరుగానీ ఒక నాలుగు రోజులు విధులు బహిష్కరిస్తే పరిస్థితులు తారు మారు అయి పోతాయి.కానీ మా డ్రైవరన్నలు వారికి ఎంతో కష్టం వస్తే గానీ….అదీ యాజమాన్యాలు చెబితే తప్ప మా కోసం మేము ఎప్పుడూ కూడా గొంతెమ్మ కోర్కెలు కోరుతూ ఎవరిపై మేము డిమాండ్ చేసింది లేదు. కుటుంబాలు కోసం అందరూ కష్టపడి పనిచేయాల్సిందే… మేమొక్కరిమే కష్టపడుచున్నాం అనేది కాదు ఇక్కడ.అన్ని రంగాలలో కష్టం ఉంది. అయితే ఈ రవాణారంగం లో పనిచేస్తున్న మా డ్రైవర్ల ‘రక్తఘోష’ ఎవరికి పడుతుంది.లారీడ్రైవర్ల వృత్తి,జీవితం అనేది “నెత్తుటి కూడు”గా వర్ణిం చడంలో చాలా అర్ధం ఉంది.అంతగా మేము ఈ రవాణారంగంలో మగ్గిపో తున్నాం.కానీ మాకున్న ఆనందం ఏమంటే ఒకరికి చేయి చాపకుండా గౌరవంగా బ్రతుకుతు న్నాం.ఎన్నో ఆశలతో రోడ్డు ఎక్కుతాం…అలాగే ఎంతో సంతోషంగా డ్యూటీ ముగించుకుని ఇంటికి చేరుకోవాలని,మళ్ళీ డ్యూటీ ఎక్కేలోగా కుటుంబంతో సంతోషంగా ఉండాలి అని అను కుంటాం.ఈ లోగా కొందరు డ్రైవరన్నలు ఆలోచనను ఏదో శక్తి అమాంతం తిరిగిరాని లోకాలకు తీసుకెళుతుంది.చూడండి బ్రతుకుదేరువు కోసం మా వాహన చక్రం విశ్రాంతి లేని పరుగులా మారిన వేళ ఎన్ని ప్రాణాలు అనంత లోకాలకు చేరాయో…!ఇది కదా తిరిగిరాని ప్రయాణం. ఇంతగా కష్టాల కడలిలో తీరం చేరని ‘నావ’లా జీవనం సాగిస్తున్న డ్రైవర న్నలను ఎవరు గుర్తిస్తున్నా రు.మాకు ఓ కుటుంబం ఉంది.కానీ ఎప్పుడో ఓ సారి మాత్రమే కలుసుకునే అవకాశం.మా చంటి బిడ్డ లను ముద్దాడలేని పరి స్థితులు,చిన్నారి బిడ్డల ఎదుగుదల చూడలేక పోతున్నాం.చుట్టాలను చూసుకోలేం,స్నేహితుల తో గడపలేం.కారణం జీవితం అంతా రోడ్లపై గడపటమే ఈ బ్రతుకులకు సరైన అర్ధం.అయితే బ్రతుకు భారం కాదు-ఈ బ్రతుకులు తిరుగులేని సాహసం అని ఎక్కడో తెలియని ధైర్యం ముందు కు నడిపిస్తుంది.మరో వేదన-ఇదో శోధన ఓటు హక్కు ఉంటుంది కానీ ఓటు వినియోగించుకునే అవకాశం ఉండదు డ్యూటీ లో ఉంటాం కాబట్టి. స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా మెరుగుపడని జీవితాలు. ఏ హక్కులు పొందని బ్రతుకులు.ఇక ఈ దేశం ఈరోజు ముందుకు నడుస్తుంది అంటే దానికి కారణం రవాణారంగంలో ఓ ముఖ్యపాత్ర లారీ డ్రైవర్ ది కూడా ఉందని గర్వంగా చెప్పుకునే స్థితిలో ఎంతోమంది డ్రైవరన్నలు ఉన్నారు.సమాజంలో ప్రముఖులు కూడా మా డ్రైవర్ల జీవన విధానం పరిస్థితులపై తప్పనిసరిగా మాట్లాడాలి.మీడియా కూడా చర్చావేదికలు ఏర్పాటు చేసి మా సంక్షేమం గురించి మాట్లాడాలి.ఎందుకంటే మా వేమీ గొంతెమ్మ కోర్కెలు కాదు కాబట్టి. ఇది తెలుసా మీకు ఒక భారీ వాహనం ఒక సంవత్సరానికి ఇటు రాష్ట్రానికి,అటు దేశానికి టాక్స్ లు,పర్మిట్, ఇన్సూరెన్స్,టోల్ గేట్స్, బోర్డర్స్ వద్ద ప్రభుత్వానికి చెల్లిస్తున్న మొత్తము కలిపి ఏడు లక్షల రూపాయల ఆదాయం ప్రభుత్వానికి చేకూరుతుందని సమాచారం.అలాగే వ్యాపారస్తులు,పలు ఇండస్ట్రీలు,రైతులు పండించే పంటలను ఎయిర్పోర్టు,ఓడరేవులు నుంచి మనకు కావలసిన నిత్యవసర సరుకులు, ఎగుమతులు చేస్తూ ఒక ప్రభుత్వాన్ని ప్రజలను ముందుకు నడిపిస్తుంది డ్రైవర్లు.ఎన్నో కష్టాలు ఒక రాష్ట్రం నుంచి వేరొక రాష్ట్రానికి పోవాలి అంటే రూల్స్ వేరువేరుగా ఉంటాయి.మాట్లాడే భాష, ప్రాంతం,ఆయా ప్రాంతాల్లో దొంగల భయం,దారిదోపిడి ముఠాలు,వీటిని దాటుకు ని కుటుంబాన్ని విడిచిపెట్టి వేల కిలోమీటర్ల ప్రయాణం.అలా నిద్రమత్తులో ఎందరో ప్రాణాలు కోల్పోయారు. ఒరిస్సా,అస్సాం, నాగాలాండ్ రాష్ట్రాలలో దోపిడీదారుల చేతిలో మరణం పొందారు. కొంతమంది ప్రమాదవ శాత్తు యాక్సిడెంట్ కేసుల్లో పలు రాష్ట్రాలలో ఉన్న జైళ్ళలో బెయిలు రాక, పట్టించుకునేవారు లేక, కుటుంబాలకు దూరమై పోయారు.ఏ…మావిమాత్రం కుటుంబాలు కాదా…?మేము మాత్రం మనుషు లం కాదా…?మేమేమైనా దేశ ద్రోహులమా…?ఎవరికి చెప్పుకోవాలి మా డ్రైవర న్నల రక్త కన్నీటి గాధలు..? పట్టించుకునే బాధ్యత ఎవరు వహిస్తున్నారు మా బాధలు.మాకు గుర్తింపు లేకపోయినా సగర్వంగా 153 కోట్ల మంది జనాభా పైబడిన ఈ దేశాన్ని నడి పిస్తున్నందుకు డ్రైవర్ గా గర్వపడుతున్నాం.5ఏళ్ల కు ఒక్కసారి ప్రభుత్వాలు, పాలకులు మారిపోతున్న రవాణారంగంలో డ్రైవర్లు గా పనిచేస్తున్న వారిని గుర్తించేది ఎవరు…?

  • Related Posts

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!!

    28న రైతుల దేశవ్యాప్త నిరసన..!! సంయుక్త కిసాన్‌ మోర్చా పిలుపు.. పంజాబ్‌ పోలీసుల చర్యపై ఆగ్రహంచండీగఢ్‌ : డిమాండ్ల సాధనకు ఆందోళన చేస్తున్న రైతుల పట్ల పంజాబ్‌ పోలీసుల వైఖరిని నిరసిస్తూ మార్చి 28న దేశవ్యాప్తంగా నిరసన ప్రదర్శనలు చేయాలని సంయుక్త…

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!!

    ఉగాది ఈ నెల 30 న శ్రీవిశ్వావసు నామ సంవత్సరం!!! 🥭తెలుగు సంవత్సరాది ఉగాది. జీవన రాగాన్ని ఆలపించే కోయిల గానాలు, మమతల పరిమళాలు పంచే ప్రసవాలతో ఆహ్లాద వాతావరణం. కష్టాల వడగాడ్పులకు చలించక చైత్రంలో తరువుల్లా స్థిరంగా నిలవడమే లక్ష్యం.…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    బాసర్ నుండి మాహుర్ కు జాతీయ రహదారి నిర్మాణం కోసం ప్రతిపాదన పంపండి

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    ఆలయ భూములు అన్యాక్రాంతమైతే ఊరుకోం

    దేవాలయాల భూములను పరిరక్షించండి

    దేవాలయాల భూములను పరిరక్షించండి

    అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినమాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్

    అనారోగ్యంతో మరణించిన నరసింహులు కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసినమాసాయిపేట బిజెపి మండల అధ్యక్షులు పాపన్న గారి వేణుగోపాల్