జనసేన కొత్త పోస్టర్ అదుర్స్.. ఫొటో వైరల్
మనోరంజని ప్రతినిధి మార్చి ౦2 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తరువాత తన పార్టీ తొలి ఆవిర్భావ దినోత్సవం కావడంతో చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేస్తున్నారు. పిఠాపురం నియోజకవర్గం చిత్రాడ వేదికగా ఈ నెల 14వ తేదీన ఈ మహా వేడుక నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే శనివారం ఆవిర్భావ దినోత్సవానికి సంబంధించిన సరికొత్త పోస్టర్ను పార్టీ నాయకత్వం విడుదల చేసింది. ఈ ఫొటో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంధీ