జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన

జనగామ జిల్లాలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి, శంకుస్థాపన

మనోరంజని ప్రతినిధి జనగామ జిల్లా: మార్చి 16 – తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇవ్వాళ జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్‌లో పర్యటిం చారు. ఈ సందర్భంగా రూ. 800 కోట్ల అభివృద్ధి పను లకు సీఎం శంకుస్థాపనలు చేశారు. రూ.102.1 కోట్లతో మహిళాశక్తి పథకం ద్వారా స్వయం సహాయక సంఘా లకు మంజూరు చేసిన ఏడు ఆర్టీసీ బస్సులను లబ్ధిదారులకు అందజేశారు. వేదిక వద్ద వివిధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మహిళా శక్తి స్టాళ్లను సందర్శించారు. అనంతరం ప్రజాపాలన బహిరంగ సభలో పాల్గొన్నారు. అనంతరం స్టేషన్ ఘనపూర్ శివారు శివునిపల్లిలో ప్రజా పాలన సభకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు.శివునిపల్లి వద్ద ప్రజాపాలన బహిరంగ సభలో దాదాపు 50 వేల మంది హాజరయ్యారు. స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరితో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా పాల్గొన్నారు. వేసవి ఎండల నేపథ్యంలో సభా ప్రాంగణంలో జర్మన్‌ టెక్నాలజీ టెంట్లను వేశారు. ఈ సందర్భంగా నియోజ కవర్గంలో రూ.200 కోట్ల వ్యయంతో యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ ను ప్రారంభించారు. దీంతో పాటు.. రూ.12.9 కోట్లతో గోవర్ధనగిరి నుంచి చర్ల తండా వరకు రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. వీటితో పాటు రూ.26 కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్‌ డివిజనల్‌ స్థాయి ఆఫీస్‌ కాంప్లెక్స్‌, రూ.45. 5 కోట్లతో ఘన్‌పూర్ లో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు, రూ.5.5 కోట్లతో ఘన్‌పూర్ లో డిగ్రీ కాలేజీ ఏర్పాటు వంటి పనుల్లో పాల్గొన్నారు.దేవాదుల ఎత్తిపోతల పథకం ఫేజ్‌-2లో భాగంగా రూ.148.76 కోట్లతో ఆర్‌ఎస్‌ ఘన్‌పూర్‌ ప్రధాన కాలువ సీసీ లైనింగ్‌ పనులు, రూ.25.6 కోట్ల వ్యయంతో స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోకవర్గంలో 750 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశారు.

  • Related Posts

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు

    సోషల్ మీడియా కోఆర్డినేటర్ ని పరామర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రామడుగు మండలం కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జవ్వాజి అజయ్ ఇటీవల బైక్ నుండి కింద పడగా కాలు కీ గాయం కాగా ఆదివారం రోజున రామడుగు మండలం…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    అమెరికాలో రోడ్డు ప్రమాదం

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    ఏపీలో నేటి నుంచి పదో తరగతి పరీక్షలు

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    విద్యుత్ బకాయిలను విడుదల చేయాలని పొన్నం ప్రభాకర్ ను కోరిన ➖ కోలిపాక లక్ష్మణ్

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం

    బాలాజీ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్లో దారుణం