

మనోరంజని ప్రతినిధి సారంగాపూర్ మార్చి 20 – నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం కౌట్ల గ్రామానికి చెందిన జనం సాక్షి రిపోర్టర్ మరియు దివ్యాంగుల మండల ఉపాధ్యక్షుడు చవాన్ ప్రకాష్ తండ్రి అనారోగ్యంతో బాధపడుతూ గురువారం వేకువజామున మృతిచెందారు. వారి మృతిపట్ల పలువురు ప్రగాఢ సానుభూతి తెలిపారు. చవాన్ ప్రకాష్ కుటుంబాన్ని పరామర్శించి ఓదార్చారు. పార్థివదేహానికి నివాళులు అర్పించిన వారు వారి కుటుంబానికి మద్దతుగా ఉంటామని తెలియజేశారు. కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం నేడు స్వగ్రామంలో మధ్యాహ్నం అంత్యక్రియలు జరగనున్నాయి.