

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 14 :-రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇంకా అహంకారం ఏ మాత్రం తగ్గలేదని ముధోల్ ఎన్ ఎస్ యు ఐ నాయకులు వాగ్మారే ప్రతీక్, కంలేకర్ శశి కుమార్ అన్నారు. దళిత స్పీకర్ పై బీఆర్ఎస్ పార్టీకి గౌరవం లేదని మండిపడ్డారు. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి స్పీకర్ను నువ్వు అని సంబోధించడం సభా మర్యాద కాదన్నారు. స్పీకర్కు వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో టిఆర్ఎస్ హయాంలో దళితులను పట్టించుకోకపోవడంతోనే అధికారానికి దూరమయ్యారన్న విషయాన్ని గమనించాలి అన్నారు