

జగదీశ్వర్ రెడ్డి నీ భర్త ఆఫ్ చేయాలి
మార్కెట్ కమిటీ ఎదురుగా నిరసన
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 16 :- అసెంబ్లీ సాక్షిగా శాసనసభ స్పీకర్ అయినటువంటి గడ్డం ప్రసాద్ ని ఉద్దేశించి ఏకవచనంతో మాట్లాడినటువంటి మాజీ మంత్రి ఎమ్మెల్యే జి జగదీశ్వర్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని కోరుతూ, టిపిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు భైంసా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ నేతృత్వంలో నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీ అనేది రాష్ట్రానికి దేవాలయం లాంటిదని, అసెంబ్లీ స్పీకర్ సుప్రీం అని వ్యాఖ్యానించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి జిల్లాలో పేరు ఉన్న నాయకుడు గడ్డం ప్రసాద్ ఆయన చేసినటువంటి సేవలు గుర్తించి కాంగ్రెస్ పార్టీ ఒక దళితుడిని అసెంబ్లీ స్పీకర్గా ఎన్నుకోవడం చాలా సంతోషకరం ఆయనను ఏకవచనంతో దూషిస్తూ అవమానపరిచినటువంటి వారిని శిక్షించాలని, శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్ యు ఐ మాజీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆంజాద్ షైక్, డైరెక్టర్లు సాయినాథ్ పటేల్ నడుమిశెట్టి భూమన్న, నాయకులు భగవాన్ పటేల్, దిగంబర్, రాజేశ్వర్, కాంగ్రెస్ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు