

జగదీశ్వర్ రెడ్డి దిష్టి బొమ్మ దగ్ధం
మనోరంజని ప్రతినిధి ఖానాపూర్ మార్చి 13 :- అసెంబ్లీ సమావేశాల్లో అభివృద్ధిపై చర్చిస్తున్న సమయం లో బి.ఆర్.ఎస్ ఎమ్మెల్యే జగదీశ్ రెడ్డి స్పీకర్ పై చేసిన వాఖ్యలకు నిరసన గా కడెం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్మల్ మంచిర్యాల ప్రధాన రహదారి పై జగదీశ్వర్ రెడ్డి దిష్టిబొమ్మ ని దగ్ధం చేశారు ఈ సందర్బంగా నాయకులు మాట్లాడుతు ప్రజా ప్రభుత్వం లో అనేక సంక్షేమ పథకాల ప్రవేశ పెడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పై అనుచిత వాఖ్యలు చేయడం సమంజసం కాదని అన్నారు .ఈ కార్యక్రమంలో జిల్లా మండల నాయకులు పాల్గొన్నారు