

చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు: మంత్రి సీతక్క
మనోరంజని ప్రతినిధి మార్చి 2౦ – తెలంగాణ : చైల్డ్ ట్రాఫికింగ్‌కు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మంత్రి సీతక్క హెచ్చరించారు. చిన్నారుల అక్రమ రవాణా మూలాలను చేధించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. సంతానం లేనివారు నియమాలు, నిబంధనల ప్రకారం దత్తత తీసుకోవాలని, చట్ట విరుద్ధంగా తీసుకునే దత్తత చెల్లుబాటు కాదని సూచించారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. చైతన్యపురిలో రక్షించబడిన చిన్నారుల తల్లిదండ్రుల ఆచూకీ దొరికేంతవరకు వారు తమ శాఖ సంరక్షణలో ఉంటారని తెలిపారు.