

చెరువులు తూములు, మత్తల్లు సరిచేసి హద్దులు సూచించండి.
ప్రజావాణిలో ఫిర్యాదు
మనోరంజని న్యూస్, మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి. మార్చి 24 మంచిర్యాల జిల్లా,భీమారం మండలంలోని నర్సింగాపూర్ గ్రామంలోని చెరువు తూములు, మత్తల్లు రిపేర్ చేసి, చెరువుకు హద్దులు సూచించాలని ప్రజావాణిలో కాసిపేట రవి ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా కాసిపేట రవి మాట్లాడుతూ ఇంతకుముందు కూడా ప్రజావాణిలో ఫిర్యాదు చేశామని, కానీ పనులు నత్తనడక గా జరుగుతున్నాయని, ఇప్పటికైనా అధికారులు పనులు తొందరగా జరిపితే వచ్చే వర్షాకాలంలో చెరువులో నీరు నిలిచి వ్యవసాయంపై ఆధారపడిన యువత వలస వెళ్లకుండా ఆపిన వారవుతారని తెలిపారు