

చిట్టి డబ్బులు కట్టలేక కరెంటు స్తంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన పబ్బల్ల కొమురయ్య తండ్రి భూమయ్య (55) సంవత్సరాలు. అను అతడు మూడు నెలల క్రితం తన కులం సంఘంలో 30 వేల రూపాయలు తీసుకొని,రెండు నెలలుగా అట్టి డబ్బులు కట్టడం లేదు. శనివారం రోజున కులం చిట్టి ఉన్నందున అట్టి డబ్బులు కట్టడానికి తన దగ్గర డబ్బులు లేనందున, అవి ఎలా కట్టాలో అని బాధపడుతూ 01-03-2025 రోజున తన పొలం వద్ద ఉదయం ఆరు గంటలకు నైలాన్ తాడుతో కరెంటు స్తంభానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని మృతుని కొడుకు పబ్బల శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మండల ఎస్.ఐ పృధ్విధర్ గౌడ్ తెలిపారు