

చలివేంద్రం ప్రారంబోత్సవంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి
మనోరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 27 : ఫరూఖ్ నగర్ మండలం రంగంపల్లి గ్రామంలో మండల అధ్యక్షులు పిట్టల సురేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవంలో ముఖ్య అతిథి గా బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై ప్రారంభించడం జరిగింది.
అలాగే మండల అధ్యక్షులు పిట్టల సురేష్ ను విష్ణువర్ధన్ రెడ్డి గారు అభినందించి సన్మానించడం జరిగింది.ఈ సందర్బంగా విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
ప్రతి ఒక్కరికి సేవా చేసే గుణం ఉండాలని అన్నారు.ప్రస్తుత పరిస్థితిలో ఎండలు అధికంగా ఉండడంవల్ల వడ దెబ్బ తగలకుండ ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకుంటూ మంచి నీరు ఎక్కువ తీసుకోవాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు ఇస్నాతి శ్రీనివాస్, మోహన్ సింగ్,చేగు సుధాకర్ అప్ప,జిల్లా కౌన్సిల్ సభ్యులు మిద్దె గణేష్, రాజు నాయక్, శ్రీనివాస్, మరియు గ్రామ బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..