ఘనంగా సమతా సైనిక్ దళ్ స్థాపన దినోత్సవం

ఘనంగా సమతా సైనిక్ దళ్ స్థాపన దినోత్సవం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 20 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లో సమతా సైనిక్ దళ్ -మహాడ్ చెరువు సత్యాగ్రహం క్రాంతి దినోత్సవం భారతీయ బౌద్ధ మహాసభ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాత్మ జ్యోతిబాపూలే చౌరస్తా నుండి నాగార్జున నగర్ బుద్ధ విహార వరకు సైనికులు కవాతు నిర్వహించారు. అనంతరం గౌతమ బుద్ధుడు -బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు దీప ధూప పూజలు చేశారు. ఈ సందర్భంగా బిఎస్ఐ తెలంగాణ రాష్ట్ర ఇంచార్జ్ సంజయ్ బోధి కస్తూరే మాట్లాడుతూ భారతీయ బౌద్ధ మహాసభ కార్యక్రమాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లడం అభినందనీయమన్నారు. గతంలో జిల్లాలో భారతీయ బౌద్ధ మహాసభలో పనిచేసే కార్యకర్తల సంఖ్య చాలా తక్కువగా ఉండేదన్నారు. ప్రస్తుతం మహిళలు పురుషులు వేల సంఖ్యలో ఉండడం బాధ్యుల పనితనానికి నిదర్శనం అన్నారు. ఇలాగే కార్యక్రమాలను ఉత్సాహంగా కొనసాగించాలని ఆకాంక్షించారు. యువత సమతా సైనిక దళ్- మహాడ్ చెరువు సత్యాగ్రహం చరిత్రను విధిగా చదివి ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో భారతీయ బౌద్ధమహసభ ఉత్తర తెలంగాణ అధ్యక్షుడు ప్రభాకర్ గడ్పాలే, కార్య అధ్యక్షులు- ఎస్ఎస్ డి రాష్ట్ర ఉపాధ్యక్షులు నారాయణ వాగ్మారే, ఉపాసకులు అడ్వకేట్ శంకర్ గడ్పలే దేవిదాస్ హాస్డే, గంగాధర్ దగ్డే, గంగాధర్ చందనే, నిజామాబాద్ జిల్లా బిఎస్ఐ అధ్యక్షుడు డిఎల్ మాల, జగిత్యాల జిల్లా బిఎస్ఐ అధ్యక్షులు కే. శంకర్, ఉత్తర తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు అబ్బారావు వాగ్మారే, జిల్లా కార్యవర్గ సభ్యులు శృంగార గంగాధర్, ఉపాసకులు, ఉపాసికులు, యువకులు, తదితరులు పాల్గొన్నారు.

  • Related Posts

    పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ షాద్ నగర్ నియోజకవర్గ వ్యాప్తంగా 4వేల కుటుంబాలకు రంజాన్ తోఫా మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : షాద్ నగర్ నియోజకవర్గంపై నిత్యం ఆ అల్లా దయ…

    అవినీతి లేకుండా షాద్ నగర్ లో సుపరిపాలన అందిస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    అవినీతి లేకుండా షాద్ నగర్ లో సుపరిపాలన అందిస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఇలాంటి ఎమ్మెల్యేను నేను ఏక్కడ చూడలేదు గ్రంథాలయ చైర్మన్ కొప్పుల మధన్ మోహన్ రెడ్డి మనోరంజనీ రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 29 : రాష్ట్రంలోనే కాదు…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు ఉగాది పండుగ వేడుకలు.

    అంగన్వాడీ కేంద్రంలో ముందస్తు ఉగాది పండుగ వేడుకలు.

    పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    పేద ముస్లింలకు రంజాన్ తోఫా అందచేసిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    అవినీతి లేకుండా షాద్ నగర్ లో సుపరిపాలన అందిస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    అవినీతి లేకుండా షాద్ నగర్ లో సుపరిపాలన అందిస్తున్నా ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

    మయన్మార్ లో 1000 కి చేరిన మరణాల సంఖ్య

    మయన్మార్ లో 1000 కి చేరిన మరణాల సంఖ్య