

ఘనంగా ల్యాబ్ టెక్నీషియన్ డే
మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 13 :-
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ల్యాబ్ టెక్నీషియన్ డే ను అధ్యక్షుడు వంశి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు చికిత్సలు ల్యాబ్ టెక్నీషియన్లు కీలకపాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ల్యాబ్ టెక్నీషియన్ డే సందర్భంగా కార్యవర్గ సభ్యులను సన్మానించారు. ఈ కార్యక్రమంలో బైంసా ల్యాబ్ టెక్నీషియన్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు