ఘనంగా ఆచార్య దేవో భావ కార్యక్రమం

ఘనంగా ఆచార్య దేవో భావ కార్యక్రమం

మనోరంజని ప్రతినిధి ముధోల్ మార్చి 18 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రములోని శ్రీ సరస్వతీ శిశు మందిర్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆచార్యులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు 10వ తరగతి విద్యార్థులకు మార్గదర్శనం చేశారు. 10వ తరగతి విద్యార్థులు వారి అభిప్రాయాలను వెల్లడించారు. విద్యార్థులకు స్వీట్ మెమోరీస్ లా గుర్తుండేలా 9వ తరగతి విద్యార్థులు గ్రూప్ ఫోటోలను అందించారు. విద్యార్థులు పరీక్షలు బాగా రాసి మంచి గుణములు సాధించాలని కోరుకుంటు 8వ తరగతి విద్యార్థులు పరీక్ష సామాగ్రి అందించారు. విద్యార్థులు భవిష్యత్తులో ఆధ్యాత్మిక చింతనతో మంచి ఉత్తమ పౌరులుగా ఎదగాలని కోరుకుంటూ “బండారి హన్మండ్లు” ఫౌండేషన్ వారు భగవద్గీత పుస్తకాలు అందించారు. ఈ సందర్భంగా ప్రధానాచార్యులు సారథి రాజు మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు, ఆచార్యుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించి మంచి పేరు సంపాదించాలని, సమాజం లో మంచి స్థితికి ఎదగాలని కన్నతల్లి దండ్రులను చదువుకున్న పాఠశాలను బోధించిన ఆచార్యులను ఎన్నటికీ మరవరాదని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విభాగ్ సహా కార్యదర్శి సరుకొండ దామోదర్, జిల్లా కోశాధికారి ధర్మపురి సుదర్శన్, సమితి అధ్యక్షుడు రవీంద్రనాథ్ పాండే, సమితి ఉపాధ్యక్షుడు ముత్యాల కిషన్, పాఠశాల కార్యదర్శి కంది మానాజీ, సహా కార్యదర్శి వేదపాఠక్ నిశికాంత్, బండారి హన్మండ్లు ఫౌండేషన్ ఫౌండర్ బండారి శ్రీకాంత్, అకాడమిక్ ఇంచార్జీ దేవెందర్ చారి, ఆచార్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 10వ తరగతి విద్యార్థులు వారి జ్ఞాపకార్థం 40 డెస్క్ బెంచీలను పాఠశాలకు విరాళంగా అందించారు

  • Related Posts

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 19తెలంగాణ వార్షిక బడ్జెట్ 2025-26కి కేబినెట్ ఆమోదముద్ర వేసింది. అనంతరం అసెంబ్లీలో డిప్యూటీ సీఎం, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క బడ్జెట్ ను ప్రవేశపెడుతు న్నారు. రూ.3,04,965 కోట్లతో తెలంగాణ…

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్ ప్రతి రంగానికి ప్రతి వర్గానికి వెన్నుపోటు 6 గ్యారంటీలతోపాటు ఎన్నికల హామీలకు మంగళం అన్ని వర్గాలను మోసం చేసిన బడ్జెట్ ఇది 40% కమిషన్ల కాంగ్రెస్ బడ్జెట్ ఇచ్చిన మాటకు కాకుండా…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    3,04965 కోట్లతో తెలంగాణ బడ్జెట్!

    ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    ఇండియా తీసేసి.. భారత్‌ పెట్టండి! కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    ఈ బడ్జెట్లో తెలంగాణ ప్రజలకు దక్కేది గుండు సున్న-కేటీఆర్

    42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం ధోండి రమణ

    42 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లును శాసనసభలో ఆమోదం పొందడం చరిత్రాత్మకం ధోండి రమణ