గ్రీవెన్స్ డే తో బాధితుల సమస్యల సత్వర పరిష్కారానికి చర్యలు.
*ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలి: నిర్మల్ జిల్లా ఎస్పీ డాక్టర్ జి. జానకి షర్మిల ఐపీఎస్.
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 10 :- ప్రజావాణి కార్యక్రమంలో బాగంగా వివిధ సమస్యలపై వచ్చిన ఫిర్యాదులను జిల్లా ఎస్పీ కార్యాలయంలో బాధితుల నుండి ఫిర్యాదులను స్వీకరించారు. వాటిని చట్టప్రకారం పరిశీలించవలసిందిగా సంబంధిత ఇన్స్పెక్టర్ మరియు ఎస్ఐ లకు సూచించారు. భూములకు సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్న కోర్టు ద్వారానే పరిష్కరించుకోవాలని ఫిర్యాదుదారులకు సూచించారు. అధికారులు బాధితులు తీసుకొవచ్చే ఎలాంటి ఫిర్యాదులు పెండింగ్లో ఉంచరాదని వాటిని వెంటనే పరిష్కరించాలని ఫోన్లో మాట్లాడి సంబంధిత అధికారులకు సూచించారు. అలాగే ఫిర్యాదులు పెండింగ్లో ఉంటే వాటికి సంబంధించిన సమాచారాన్ని బాధితులకు తప్పకుండా తెలపాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లాఎస్పీ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని సమస్యలు పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తుందని తెలియజేశారు. ప్రజలకు శాంతి భద్రతలకు సంబంధించి అక్రమ కార్యకలాపాల్లో పాల్గొంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు