

గ్రామ పంచాయతీల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం నిదులే : పాలమూరు విష్ణువర్ధన్
విట్యాల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో
సీసీ రోడ్ ప్రారంభోత్సవం లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య
మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 05 : విట్యాల గ్రామంలో కేంద్ర ప్రభుత్వం నిధులతో మాజీ సర్పంచ్ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో సీసీ రోడ్ పనులను ప్రారంభించడం జరిగింది.
ఈయొక్క సీసీ రోడ్ ప్రారంభోత్సవంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి, అందె బాబయ్య ముఖ్య అతిథులు గా పాల్గొని ప్రారంభించడం జరిగింది.
పాలమూరు విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ
గత పది సంవత్సరాలనుండి తెలంగాణలో గ్రామ పంచాయతీలు అభివృద్ధి చెందాయంటే కేవలం కేంద్ర ప్రభుత్వం నిదులనుండే అని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్రమోడీ గ్రామ పంచాయతీ లకు, మున్సిపాలిటీలకు అనేక నిధులు కేటాయించడం జరిగిందన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీ ఎన్నికలు సరైన సమయంలో నిర్వహించి ఉంటే కేంద్రం నుండి అనేక నిధులు వచ్చేవని అన్నారు.
గత పాలకులు గ్రామ పంచాయతీలను పట్టించుకోలేదు
ఇప్పుడు రాష్ట్రం లో కాంగ్రెస్ ప్రభుత్వం తీరు గత పాలకుల మాదిరిగానే వ్యవహరించడం సిగ్గు చేటని అన్నారు.
సీసీ రోడ్లు, వీధి లైట్లు, త్రాగు నీరు కు కేంద్ర ప్రభుత్వం ఎన్నో నిధులు కేటాయించడం జరుగుతుంది కావున రాష్ట్ర ప్రభుత్వం త్వరలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించి అభివృద్ధి కి సహకరించాలని విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు.
అందె బాబయ్య గారు మాట్లాడుతూ
రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహించిన కార్యకర్తలు సిద్ధంగా ఉండాలనీ అన్నారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటిగా గెలిచినప్పుడే రాష్ట్రం లో అధికారం లోకి వస్తామని అన్నారు.
ఈ కార్యక్రమంలో బిజెపి మండల అధ్యక్షులు పిట్టల సురేష్, రఘు గౌడ్, శివ శంకర్, వినోద్ నాయక్, విష్ణు, వెంకటేష్, సునీత,, అభిరామ్, భైరమోని వెంకటేష్,రెబ్బనమోని యాదయ్య, జె రమేష్, యాదయ్య, టిక్యా, జెటవత్ శ్రీను, చిన్న రాజు, కావలి యాదయ్య, నర్సిములు, రవి, కృష్ణ మరియు గ్రామస్తులు పాల్గొన్నారు..