

గ్రామాల్లో ఘనంగా కామ దహనం
మనోరంజని ప్రతినిధి ముధోల్.మార్చి 13 :- నిర్మల్ జిల్లా ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ తో పాటు మండలంలోని ఆయా గ్రామాల్లో గురువారం రాత్రి గ్రామస్తులు కామ దహనం చేశారు. మండల కేంద్రంలో పాత బస్టాండ్ ఆవరణలో అధికారికంగా ప్రభుత్వము ఆధ్వర్యంలో కాముని దహనం చేశారు. అదేవిధంగా ఆయా కాలనీలో ప్రజలు కాముని దహనం చేశారు. గ్రామాల్లో సైతం గ్రామస్తులు ఆధ్వర్యంలో కాముని దహన ఉత్సవాలను ఘనంగా జరుపుకున్నారు. హెూలి పండుగకు ఒక రోజు ముందు రాత్రి కాముని దహనం చేయడం అనవాయితీగా వస్తోంది. కార్యక్రమంలో తహసిల్దార్ శ్రీకాంత్, విడిసి అధ్యక్షులు విట్టల్, ఉపాధ్యక్షుడు పల్లెల్ల నాగేష్,కోశాధికారి వెంకటేష్, సహా కోశాధికారి దశరథ్,నాయకులు జీవన్, సోమేష్ తదితరులు ఉన్నారు