

గ్రామస్తులకు 14 లక్షల ప్రొసీడింగ్ కాపీ అందజేత
మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 18 :- నిర్మల్ జిల్లా బైంసా మండలం దేగాం గ్రామంలోని ముధోల్ మాజీ శాసనసభ్యులు విట్టల్ రెడ్డి నివాసంలో తానూరు మండలంలోని బోసి గ్రామానికి పంచాయతీరాజ్ శాఖ ద్వారా సుమారు 14 లక్షల రూపాయలు డ్రైన్- సిసి రోడ్డు నిర్మాణం కోసం సంబంధించిన ప్రొసీడింగ్ కాపీని గ్రామస్తులకు అందజేయడం జరిగింది. నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి- జిల్లా ఇన్చార్జి మంత్రి సీతక్కకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మాజీ శాసనసభ్యులు జి. విఠల్ రెడ్డి. మాజీ జడ్పీటీసీ మాట్లాడుతూ గడ్డన్న కాకా నుండి ఇప్పటి వరకు తన సొంత ఊరి లాగా చూస్తూ గ్రామం యొక్క అభివృద్ధి కి చేస్తున్న కృషిని ఎల్లా వేళల మారవ కుండా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసి ఉత్తంభాలే రావు, నాగేష్, గంగాధర్, నర్సయ్య, గంగాధర్, సంజయ్, రమణాగౌడ్, సాయి, తదితరులు ఉన్నారు