

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపి సంపూర్ణ విజయం సాధించింది – ముత్యాల బంటీ
మనోరంజని ప్రతినిధి నిర్మల్ మార్చి 05 ;- ఆదిలాబాద్ – కరీంనగర్ – నిజామాబాద్ – మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అంజి రెడ్డి ఘన విజయం సాధించారు. ఓటు వేసిన ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్ లకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ వచ్చే స్థానిక, పుర ఎన్నికల్లో బీజేపి జెండా ఎగరడం ఖాయం అన్నారు. కాంగ్రెస్ పార్టీ పట్ల తెలంగాణ ప్రజలకు నమ్మకం కోల్పోయింది అని, ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వం కాలయాపన చేస్తుంది అని విమర్శించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అనేక రంగాలలో దేశం అభివృద్ధి చెందుతుంది అని అన్నారు.