

మనోరంజని ప్రతినిధి భైంసా మార్చి 22 :- నిర్మల్ జిల్లా భైంసా మండలం సిద్దూర్ గ్రామంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఈ గ్రామ శివారులో రైతు జాదవ్ మారుతి పాటిల్ పండించిన గోధుమ పంట కుప్పకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట ఈ ఘటనలో పూర్తిగా దగ్ధమైంది.పంటకు నిప్పు పెట్టడంతో సుమారు రూ.30,000 మేరకు నష్టం వాటిల్లిందని బాధిత రైతు పేర్కొన్నారు. ఈ ఘటనపై తక్షణమే దర్యాప్తు చేసి బాధ్యులను పట్టుకుని కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు కోరారు. స్థానికులు ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వ్యవసాయానికి ఆధారపడిన రైతులు ఇలాంటి ఘటనల కారణంగా తీవ్ర ఆర్థిక నష్టాలు ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు
