గూడు కోల్పోయిన రాథోడ్ దినేష్ కుటుంబానికి అండగా ప్రజా ట్రస్ట్

గూడు కోల్పోయిన రాథోడ్ దినేష్ కుటుంబానికి అండగా ప్రజా ట్రస్ట్

మనోరంజని ప్రతినిధి కుంటాల మార్చి 12 :-

ముధోల్ నియోజక వర్గం నర్సాపూర్(జి)మండలం హనుమాన్ తండాకి చెందిన రాథోడ్ దినేష్ ఇల్లు గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు షాట్ సర్క్యూట్ తో పూర్తిగా దగ్దం ఆయింది. ఇంటి లోపల ఉన్న నిత్యావసర సరుకులు, ఇంటిలోని వస్తువులు బంగారం- నగదు పూర్తిగా దగ్ధం అయ్యి కుటుంబం రోడ్డున పడటంతో ఈ విషయం వివిధ మాధ్యమాల ద్వారా మండల నాయకుల ద్వారా సమాచారం తెలుసుకున్న మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఛైర్మెన్ భోస్లే మోహన్ రావు పటేల్ బాధిత కుటుంబీకులను పరామర్శించారు. జరిగిన ఘటన పరిశీలించారు. బాధిత కుటుంబీకులను సంఘటన సంబంధించిన వివరాలు అడిగి వివరాలు తెలుసుకున్నారు. బాధలో ఉన్న కుటుంబీకులను ఓదార్చారు. బాధిత కుటుంబానికి అండగా ఉండాలనే ఉధ్యేశంతో మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో తక్షణ సహయం క్రింద నిత్యావసర సరుకులు అందించారు. ప్రస్తుత ఖర్చుల నిమిత్తం కొంత నగదు అందించి మానవత్వం చాటుకున్నారు. అంతేకాకుండా మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో కుటుంబానికి తక్షణమే తాత్కాలికంగా ఉండడానికి ఇంటిని నిర్మించి ఇస్తానని మోహన్ రావ్ పటేల్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మోహన్ రావ్ పటేల్ ముధోల్ నియోజకవర్గంలో పేద ప్రజల కోసమే మా ప్రజా ట్రస్ట్ ను స్థాపించామని నిరుపేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల ప్రజలకు అనుకోని సంఘటనలు జరిగినప్పుడు మా ప్రజా ట్రస్ట్ అండగా ఉంటుందని బాధిత కుటుంబానికి స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వం ద్వారా సహాయం అందించాలని కోరారు. ముధోల్ నియోజక వర్గంలో ప్రమాదవశాత్తు (అగ్ని ప్రమాదం-పాముకాటు-షాట్ సర్క్కుట్- పిడుగు పాటు-వరద ప్రమాదం) అనుకోని సంఘటనలు జరిగితే మోహన్ రావ్ పటేల్ ప్రజా ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందించి బాసటగా ఉంటామని ట్రస్ట్ ఛైర్మెన్ మోహన్ రావ్ పటేల్ తెలిపారు ఈ కార్యక్రమంలో జాతీయ ఆహార భద్రత కమిటీ సభ్యులు సిందే దీక్షిత్ పటేల్, సీనియర్ నాయకులు నర్సయ్య, గొల్లమడ మాజీ సర్పంచ్ మహేష్, కల్లూరు మాజీ సర్పంచ్ లక్మన్ పటేల్, ,ఛత్రపతి, అరుణ్, హనుమాన్ తండా వాసులు, మండల నాయకులు, ప్రజా ట్రస్ట్ టీం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు

  • Related Posts

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి! మనోరంజని ప్రతినిధి హైదరాబాద్:మార్చి 13 -ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీలో విదేశా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జై శంకర్,తో బేటి కానున్నారు ఇందుకోసం బుధవారం సాయంత్రం ఆయన…

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్ జె.పి దర్గా ఇఫ్తార్ విందులో పాల్గొన్న బీ ఆర్ఎస్ యువ నాయకుడు వై. మురళీకృష్ణ యాదవ్ మనొరంజని రంగారెడ్డి జిల్లా ప్రతినిథి మార్చ్ 12 : తెలంగాణ సంస్కృతికి, మతసామరస్యానికి రంజాన్…

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *

    You Missed

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    అరుదైన మైలురాయిని అందుకున్న ఫోన్ పే

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    నేడు కేంద్రమంత్రి జై శంకర్ తో సీఎం రేవంత్ రెడ్డి!

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    తమిళనాడు డీఎంకే నేతలతో వైయస్ జగన్ భేటీ

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్

    మతసామరస్యాలకు ప్రతీక రంజాన్ మాసం : మురళీకృష్ణ యాదవ్