

గురుకుల సీటు సాధించిన ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు.
*మనోరంజని మంచిర్యాల జిల్లా, చెన్నూరు నియోజకవర్గ ప్రతినిధి ఏప్రిల్ 04 ;-మంచిర్యాల జిల్లా, భీమారం మండల కేంద్రం, బీసీ కాలనీలో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు ఐదవ తరగతి గురుకుల ప్రవేశ ఫలితాలలో అర్హత సాధించారు. ఎస్సీ, ఎస్టీ, బిసి, రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీలలో ఐదవ తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్షల ఫలితాలలో నిహాన్ మరియు పూజ అనే విద్యార్థులు అర్హత సాధించి ఐదవ తరగతిలో సీటు పొందారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆశీర్వాద్ మరియు ఉపాధ్యాయులు హరికృష్ణ రెడ్డి విద్యార్థులను అభినందించారు